‘అరవింద’ షూటింగ్ పూర్తి చేసింది !

‘అరవింద’ షూటింగ్ పూర్తి చేసింది !

Published on Sep 25, 2018 11:29 PM IST

Pooja Hegde

యంగ్ టైగర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ విడుదలకు సమయం దగ్గర పడుతుంది. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ ఇటలీ లో జరుగుతుంది. తాజాగా ఈచిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ చేసింది.
ఇక ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ , పూజా లపై సాంగ్ ను చిత్రీకరించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మంచి బ్రేక్ ఇస్తుందని పూజా చాలా కాన్ఫిడెంట్ గా వుంది.

త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు