రామాయణ టీజర్ లెంగ్త్ ఫిక్స్.. ఎంతసేపు ఉండబోతుందంటే..?

రామాయణ టీజర్ లెంగ్త్ ఫిక్స్.. ఎంతసేపు ఉండబోతుందంటే..?

Published on Mar 31, 2026 10:43 AM IST

Ramayana

దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ‘రామాయణ’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండటంత ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఈ టీజర్‌ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక స్పెషల్ షో వేశారు.

ఈ టీజర్ సుమారు 2 నిమిషాల 38 సెకన్ల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాముడు, సీతతో పాటు రావణుడిగా నటిస్తున్న యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు హిందీతో పాటు ఇంగ్లీష్‌ భాషలో కూడా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండబోతున్నాయని టాక్.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు