స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ తొలి పాట విడుదల !

స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ తొలి పాట విడుదల !

Published on Sep 26, 2018 2:41 PM IST

puri6

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ “నిన్ను విడవను లే ” డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ” ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజుగారితో ‘అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి’కి పని చేశాను.మళ్ళీ ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నా.. కానీ, రాజుగారు ఇతర బిజినెస్ లలో బిజీ అయిపోయారు. మళ్ళీ చాల రోజులు తరవాత ‘అనగనగ ఓ ప్రేమకథ’ సినిమాని నిర్మించారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను, తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉందిని తెలిపారు.

కాగా ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సన్నద్ధం అవుతుంది.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు