హాలీవుడ్ సినిమా చేస్తున్న తెలుగు హీరో !

హాలీవుడ్ సినిమా చేస్తున్న తెలుగు హీరో !

Published on Sep 27, 2018 3:19 AM IST

hero3

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం “భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’. కాగా ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో శ్రీరాజ్. అయితే తాజగా శ్రీరాజ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ఈ యంగ్ తెలుగు హీరో, ఇప్పుడు హాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు.

న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి ఇంజినీరింగ్ లో టాపర్ కూడా. త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించి తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు. కాగా హాలీవుడ్ లో.. ‘రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్’ వంటి సంచలన చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వలో రూపొందే ప్రతిష్టాత్మక ఆంగ్ల చిత్రంతోనే శ్రీరాజ్ హాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పై ఉబ్బితబ్బిబ్బు అవుతున్న శ్రీరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తెలుగువాడి సత్తా చాటుతానని అంటున్నాడు. మరి శ్రీరాజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు