‘నవాబ్’ అక్కడ అదరగొడుతున్నాడు !

‘నవాబ్’ అక్కడ అదరగొడుతున్నాడు !

Published on Sep 28, 2018 11:02 PM IST

Nawab2

అరవింద స్వామి , అరుణ్ విజయ్ , శింబు అన్నదమ్ములుగా విజయ్ సేతుపతి , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ భాషలో తెరకెక్కించిన చిత్రం ‘చెక్క చివంత వానం’. నిన్న విడుదలైన ఈచిత్రం అక్కడ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రం తమిళనాడులో రూ .8.05కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి విజయం దిశగా దూసుకుపోతుంది. నిన్న సెలవు దినం కాకపోయిన ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది.

ఇక నిన్న తెలుగు లో ‘నవాబ్ ‘పేరుతో విడుదలైన ఈ చిత్రానికి మిక్సడ్ రివ్యూస్ రావడంతో ఓపెనింగ్స్ కూడా నామ మాత్రంగానే వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ ఆర్ రహెమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు