ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ చేయనున్న మాస్ రాజా !

ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ చేయనున్న మాస్ రాజా !

Published on Sep 29, 2018 2:05 AM IST

raviteja

మాస్ మహారాజ్ రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈచిత్రంలో ముగ్గరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. దాంట్లో ఒక హీరోయిన్ గా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న యువ హీరోయిన్ నాబా నటేష్ నటించనుంది.

తమన్ సంగీతం అందిచనున్న ఈచిత్రంలో రవి తేజ డ్యూయెల్ రోల్లో నటించనున్నారు. ఇంతకుముందు రవితేజ తో ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని నిర్మించిన రవి తాళ్లూరి ఈచిత్రాన్ని కూడా ఆయనే నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్ పరిశీలనలో వుంది.

ఇక రవితేజ ఈచిత్రం కంటే ముందు ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నా ఈచిత్రం అక్టోబర్ 5న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు