దర్శకుడిగా మారుతున్న స్టార్ యాక్టర్ !

దర్శకుడిగా మారుతున్న స్టార్ యాక్టర్ !

Published on Sep 30, 2018 8:13 PM IST

aravind swami

రోజా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రముఖ నటుడు అరవింద స్వామి. ఇక ఈ చిత్రం తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఆయన తరువాత కొంత కాలం విరామం ఇచ్చారు. ‘తని ఒరువన్’ చిత్రం తో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈచిత్రం ఘన విజయం సాధించడంతో వరుస ఆఫర్ల వచ్చాయి.

ఇక తాజాగా ఆయన మణిరత్నం తెరకెక్కించిన’ నవాబ్’ చిత్రం లో నటించాడు . ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా తో ఈ నటుడు మణిరత్నం తెరకెక్కించిన 8సినిమాల్లో నటించాడు. కేవలం నటించడమే కాకుండా ఆయన దగ్గర డైరెక్షన్ మెళుకువలు కూడా నేర్చుకున్నాడట. దాంతో ఇప్పుడు అరవింద స్వామి దర్శకత్వం చెయ్యాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఆయన మూడు కథలను సిద్ధం చేశాడట. త్వరలోనే ఆయన దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు