జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల జీవితం ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కించడం ఇటీవల ట్రెండ్ గా మారింది. దాంట్లో భాగంగా ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ జీవిత చరిత్ర ల ఆధారంగా బయోపిక్ సినిమాలు రోపొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడారకారిణి తెలుగు తేజం పీవీ సింధు ఫై కూడా ఒక చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నటుడు సోనూసూద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం కోసం ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సోను ,సింధు ను అలాగే ఆమె తల్లితండ్రులను కలిసి సినిమా గురించి చర్చించారు. స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
అయితే ఈచిత్రంలో సింధు పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాల్సి వుంది. ఇక ప్రస్తుతం మరో బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆదారంగా ‘సైనా’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సైనా పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ఇటీవల ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది.


