‘అరవింద’ వేడుకకు బాలయ్య, చంద్రబాబు వస్తున్నారట ?

‘అరవింద’ వేడుకకు బాలయ్య, చంద్రబాబు వస్తున్నారట ?

Published on Sep 30, 2018 5:00 PM IST

ntr5

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న పూర్తి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 2న హైదరాబాద్ లోని నోవా హోటల్ లో భారీ స్థాయిలో జరుగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వేడుకకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త ఇపుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా నందమూరి బాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రానున్నారని సమాచారం. అయితే, ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనతో పాటు రాయలసీమ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ కూడా హైలైట్ అవ్వనున్నాయట. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నద్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు