ఆ హిట్ డైరెక్టర్ మైత్రీ మూవీస్‌ లో ఫిక్స్ అయినట్లే ?

ఆ హిట్ డైరెక్టర్ మైత్రీ మూవీస్‌ లో ఫిక్స్ అయినట్లే ?

Published on Oct 13, 2018 4:00 AM IST

Parasuram

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బ్లస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లు ఇప్పటికే వేరే చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటే.. ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ మాత్రం.. ఇంకా తన తర్వాత చిత్రాన్ని కూడా ప్రకటించలేదు.

ప్రస్తుతం పరుశురామ్ కి భారీ డిమాండే ఉంది. కానీ పరుశురామ్ మాత్రం ఏ విషయమైనా స్క్రిప్ట్ తర్వాతే అని దాటి వేస్తున్నాడట. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం.. మైత్రీ మూవీస్‌ సంస్థలో ప‌ర‌శురామ్‌ తన తర్వాత సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గీతా ఆర్ట్స్ కి కూడా ప‌ర‌శురామ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాగా పరుశురామ్ ఒక వ్యక్తికీ దేవుడికి సంబంధించిన కథ రాసే పనిలో ఉన్నారు. కథకి మంచి క్యారెక్టరైజేషన్స్ సెట్ అయ్యాయని, మూవీ మొత్తం ఫుల్ ఎంటరైన్మెంట్ తో సాగుతుందని, ముఖ్యంగా మనిషికి దేవుడికి మధ్య సాగే ట్రాక్ చాలా బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరి పరుశురామ్ ఈ చిత్రంతో కూడా భారీ బ్లాక్ బ్లస్టర్ కొడతాడేమో చూడాలి.

తాజా వార్తలు