ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ హిట్ చిత్రం “ధురంధర్” తర్వాత బాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన మరో చిత్రమే “బోర్డర్ 2”. స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం బోర్డర్ కి సీక్వెల్ గా ఎన్నో ఏళ్ళు తర్వాత మంచి అంచనాలు నడుమ ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ధురంధర్ కి మించి మంచి ఓపెనింగ్స్ ని సాధించింది.
ఇక ఇదే మూమెంటంని కొనసాగిస్తూ డే 2 కూడా సాలిడ్ జంప్ అందుకొని స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టినట్టు బాలీవుడ్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో మొత్తం 72.6 కోట్ల మార్క్ ని ఈ చిత్రం అందుకుంది. అయితే మూడో రోజు మాత్రం హవా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పొచ్చు. టికెట్స్ ఆల్రెడీ గంటకి 60 వేలకి పైగా కూడా తెగుతున్నాయి. దీనితో మూడో రోజు 50 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా టీ సిరీస్, జేపీ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.


