‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఆసక్తికర అంశాలు !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఆసక్తికర అంశాలు !

Published on Oct 23, 2018 10:09 PM IST

Lakshmi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించడానికి ముమ్మరంగానే సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో ‘మహానాయకుడు’కి పోటీగా రాబోతున్న ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన విషయాలను రామ్ గోపాల వర్మ చర్చించనున్నాడు. కాగా ఇప్పుడు ఆ విషయాల గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు ఘట్టం కంటే కూడా.. తెలుగు వెండితెర ఆరాధ్య దైవంగా కోట్లాది ప్రజలు చేత గౌరవింప బడ్డ ఎన్టీఆర్.. ఒక సామాన్య స్త్రీని.. అందులో అరవై సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?.

నడిచే దేవుడిగా పిలవబడ్డ ఎన్టీఆర్ ఎందుకు ఆ వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ? లక్ష్మి పార్వతిలో ఆయన్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ? లాంటి అంశాలను వర్మ విశ్లేషాత్మకంగా ఈ చిత్రంలో చూపించనున్నాడని తెలుస్తోంది. అయితే కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డ్ చూసిన వారంతా.. వర్మ ఈ చిత్రాన్ని పూర్తి సంతృప్తికరంగా తెరకెక్కించలేడని.. కొంతభాగం చిత్రీకరించే లోపే ఆయనకు ఈ చిత్రం ఆసక్తి పోతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వర్మ ఈ చిత్రానికి ఎంతవరకు న్యాయం చేయగలడో చూడాలి.

తాజా వార్తలు