ఇంటర్వ్యూ : హీరో అల్లరి నరేష్ – ‘రంభ ఊర్వశి మేనక’ చూసి ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు..!

ఇంటర్వ్యూ : హీరో అల్లరి నరేష్ – ‘రంభ ఊర్వశి మేనక’ చూసి ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు..!

Published on Sep 2, 2026 6:47 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో హీరో అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నాడు.

‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది?

సాధారణ సోషియో ఫాంటసీ చిత్రాలకు భిన్నంగా ఇందులో ‘రంభ, ఊర్వశి, మేనక’లు స్వర్గం నుండి భూమికి వస్తారు. డ్రామా కంపెనీ నడిపే హీరో, ముత్తాతల నాటి పుస్తకంలోని ఒక ప్రత్యేక ప్యాట్రన్ గీసి ఆ అప్సరసలను ఎలా ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయనేదే ఈ చిత్ర కథ.

దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?

దర్శకుడు చంద్ర మోహన్ చెప్పిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ కథ నాతో పాటు నాగార్జున, సుప్రియ, రాజేష్, నిమ్మకాయల ప్రసాద్‌లకు బాగా నచ్చింది. సీజీ వర్క్ వల్ల బడ్జెట్ పెరిగినా మంచి సినిమా అవుతుందనే నమ్మకంతోనే దీనిని ప్రారంభించాం. చంద్ర మోహన్ రాసిన ఈ కథకి నందు అద్భుతమైన డైలాగ్స్ అందించాడు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఈ చిత్రంలో నాది చాలా ఎంటర్‌టైనింగ్ ఉండే క్యారెక్టర్. ఊరిలో అందరి దగ్గరా అప్పులు చేసి, ఎవరి వద్ద నమ్మకం లేక అందరూ నెగిటివ్‌గా చూసే పాత్ర ఇది. వరుస కష్టాలు చుట్టుముడుతున్నప్పటికీ, ఆ పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇందులో కామెడీ ఎలా ఉండబోతోంది?

ఈ చిత్రంలో ఆడియన్స్ కామెడీని ఆస్వాదించే కొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా, నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడేలా దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ను డిజైన్ చేశారు. స్వర్గం, నరకం, ఇంద్రలోకం నేపథ్యంలో కథలు వచ్చి చాలా కాలం కావడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు. కుటుంబ సమేతంగా కలిసి చూసేలా చాలా క్లీన్ అండ్ ఆర్గానిక్ కామెడీతో ఈ సినిమా అలరిస్తుంది.

వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్స్ గురించి?

శ్రీనివాస్ రెడ్డి, పెద్ద నరేష్, అజయ్, తారక్ పొన్నప్ప వంటి భారీ తారగణంతో మా నాన్నగారి సినిమాల స్టైల్‌లో ఈ చిత్రాన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దాం. ఇంగ్లీష్, హిందీ మిక్స్ చేస్తూ మాట్లాడే వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రతో పాటు, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్ ఆఫీసర్‌గా తారక్ పొన్నప్ప క్యారెక్టర్లు సినిమాలో ప్రత్యేకంగా అలరిస్తాయి. అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులతో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ డ్రామాలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

ట్రైలర్ లో ఓజీ స్పూఫ్ బాగా వైరల్ అయింది కదా?

హీరో అవ్వాలనుకునే నా పాత్ర తనకు తెలిసిన సినిమా భాషలోనే నిత్యం మాట్లాడుతూ అలరిస్తుంది, ముఖ్యంగా ఇందులో వచ్చే ‘OG’ సీక్వెన్స్ కి సినిమా చూసినప్పుడు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకులు డార్క్ జోన్ సినిమాల కంటే లైట్ హార్టెడ్ కామెడీ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో, ఇకపై రెండు కామెడీ చిత్రాలు, ఒక సీరియస్ సినిమా ఉండేలా నా ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను.

‘సుడిగాడు 2’ సీక్వెల్ గురించి?

‘సుడిగాడు 2’ చేయాలని నాకు ఉన్పటికీ, నాటితో పోలిస్తే ఇప్పుడు కాపీరైట్ నియమాలు చాలా కఠినంగా మారాయి. ‘సుడిగాడు’లో 108 స్పూఫ్‌లను అనుమతితో చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రిలీజ్ సమయంలో ఎలాంటి లీగల్ అభ్యంతరాలు వస్తాయో చెప్పలేం కాబట్టి ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి?

మ్యూజిక్ చేతన్ భరద్వాజ్‌తో ఫస్ట్ టైమ్ చేస్తున్న ఈ సినిమాకు ఆయన అద్భుతమైన స్వరాలు అందించారు. నాకూ, సురభికి మధ్య వచ్చే ఒక సాంగ్ నాకు పర్సనల్‌గా బాగా నచ్చింది. మిగతా నాలుగు పాటలు కూడా చాలా ఆకట్టుకుంటాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది

మీ నెక్స్ట్ సినిమాల గురించి?

‘ఆల్కహాల్’ రిలీజ్ రెడీగా ఉంది. అలాగే ‘కనకదుర్గ’ షూటింగ్ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు