మనోజ్ ట్వీట్ ఎలక్షన్స్ కోసమా.. ? సినిమా కోసమా.. ?

మనోజ్ ట్వీట్ ఎలక్షన్స్ కోసమా.. ? సినిమా కోసమా.. ?

Published on Oct 24, 2018 1:06 AM IST

manoj

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ సామాజిక అంశాల పై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. అయితే తానూ సేవా కార్యక్రమాల్లోకి దిగనున్నట్లు, అదనుకోసమే తిరుపతిలో కొన్ని రోజులు ఉండబోతున్నట్లు మనోజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక అంతా మనోజ్ సినిమాలు చేయరేమోనని అనుకున్నారు.

కాగా మనోజ్ తన తదుపరి సినిమా గురించి ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో.. తిరుపతిలో ఘన స్వాగతం పలికిన మిత్రులకు అభిమానులకు థాంక్స్ చెబుతూ వచ్చే ఏడాది మార్చిలో మొదలవ్వబోయే చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకున్నాం అన్నారు. ఈ ట్వీట్ అర్ధాన్ని బట్టి మనోజ్ కొత్త చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ మార్చిలో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే ఇదే ట్వీట్ ని రాజకీయ పరంగా ఆలోచిస్తే.. ఏపీలో జరగబోయ్యే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అర్ధమవుతుంది. మరి మనోజ్ ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారో…!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు