రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.ఓ’ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. ఈ ‘2.ఓ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కానుందని ఈ మాటలు గుర్తు పెట్టుకొండని’ అంటూ రజనీ, దర్శకుడు శంకర్ పై మరియు చిత్రబృందం పై ఇతర తారాగణం పై ప్రశంసలు కురిపించారు.
రజనీ మాట్లాడుతూ.. ‘2.ఓ చిత్రం థ్రిల్లర్ తో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని, సినిమాలో ప్రధానంగా యూనివర్సల్ మెసేజ్ కూడా ఉందని తెలిపారు. ఇక దర్శకుడు శంకర్, ఇండియా జేమ్స్ కామెరాన్ మరియు ఇండియా స్టీవెన్ స్పిల్ బర్గ్ అని ప్రశంసించారు.
రజనీ ఇంకా మాట్లాడుతూ.. ‘శంకర్ తో పాటు రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ వంటి దర్శకులు మన దేశానికే గర్వకారణం అని అన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన హార్డ్ వర్క్ ఎంతో గొప్పదని.. ఈ చిత్రానికి ఆయన తప్ప ఇంకెవరూ అలా చెయ్యలేరని రజనీ తెలిపారు. అదే విధంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ని దేవుని కుమారునిగా రజనీ వర్ణించారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో మరియు గ్రాండ్ విజువల్స్ తో ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచుతుంది ట్రైలర్. అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఈ దర్శకులు మన దేశానికే గర్వకారణం – సూపర్ స్టార్ రజనీకాంత్
ఈ దర్శకులు మన దేశానికే గర్వకారణం – సూపర్ స్టార్ రజనీకాంత్
Published on Nov 3, 2018 3:39 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి 2’ గిఫ్ట్.. పవన్ బర్త్ డేకి అదిరిపోయిన సుజీత్, థమన్ ల సర్ప్రైజ్!
- డబుల్ సెంచరీతో దుమ్ములేపిన ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్లోనే టాప్..!
- పిక్ టాక్ : బాబాయ్‌కి మెగా పవర్ బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్
- రిలీజ్ డేట్‌పై ‘జైలర్ 2’ క్లారిటీ.. అదే ఫిక్స్..!
- కింగ్ సైజ్ సర్ప్రైజ్.. శ్రీకృష్ణ ‘దేవరాయ’గా కిచ్చా సుదీప్..!
- సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు : తమ్ముడికి మెగా బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి..!
- ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. ‘ఓజి’ యూనివర్స్ నుంచి అప్డేట్ వచ్చేస్తోంది..!
- పవన్ బర్త్‌డే.. స్పెషల్ విషెస్ చెప్పిన భార్య అన్నా..!
- పవన్ బర్త్‌డే ట్రీట్.. కేవలం అదొక్కటేనా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘యేష నాగుల కట్ట’ లోపల ఇంకా చాలా దాచామంటున్న ఆట సందీప్..!
- రష్మిక మందన్న ‘మైసా’ కొత్త పోస్టర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
- OTT Release : నెట్‌ఫ్లిక్స్‌లోకి వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. సెప్టెంబర్ 4 నుంచి 5 భాషల్లో స్ట్రీమింగ్
- డైలమాలో రజినీకాంత్ ‘జైలర్ 2’.. రిలీజ్ విషయంలో అయోమయం.. కారణం ఇదేనా..?
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
- ‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?
- సెప్టెంబర్ మూవీ బాక్సాఫీస్ హంగామా : ఈ నెలలో రాబోతున్న టాప్ సినిమాలు ఇవే!


