రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.ఓ’ చిత్రం థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ.. ఈ ‘2.ఓ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కానుందని ఈ మాటలు గుర్తు పెట్టుకొండని’ అంటూ రజనీ, దర్శకుడు శంకర్ పై మరియు చిత్రబృందం పై ఇతర తారాగణం పై ప్రశంసలు కురిపించారు.
రజనీ మాట్లాడుతూ.. ‘2.ఓ చిత్రం థ్రిల్లర్ తో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని, సినిమాలో ప్రధానంగా యూనివర్సల్ మెసేజ్ కూడా ఉందని తెలిపారు. ఇక దర్శకుడు శంకర్, ఇండియా జేమ్స్ కామెరాన్ మరియు ఇండియా స్టీవెన్ స్పిల్ బర్గ్ అని ప్రశంసించారు.
రజనీ ఇంకా మాట్లాడుతూ.. ‘శంకర్ తో పాటు రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ వంటి దర్శకులు మన దేశానికే గర్వకారణం అని అన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన హార్డ్ వర్క్ ఎంతో గొప్పదని.. ఈ చిత్రానికి ఆయన తప్ప ఇంకెవరూ అలా చెయ్యలేరని రజనీ తెలిపారు. అదే విధంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ని దేవుని కుమారునిగా రజనీ వర్ణించారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో మరియు గ్రాండ్ విజువల్స్ తో ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచుతుంది ట్రైలర్. అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఈ దర్శకులు మన దేశానికే గర్వకారణం – సూపర్ స్టార్ రజనీకాంత్
ఈ దర్శకులు మన దేశానికే గర్వకారణం – సూపర్ స్టార్ రజనీకాంత్
Published on Nov 3, 2018 3:39 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ఆట షురూ.. 27న బిగ్ ట్రీట్ ఖాయం!
- ప్రకాష్ రాజ్, రజినీ కాదు రేలంగి మావయ్య రోల్ కి ముందు రాజశేఖర్ దగ్గరకి వెళ్లారట!
- భారత్ ని తిట్టినందుకు క్షమాపణలు – ధురంధర్ 2 నటుడు సెన్సేషనల్ స్టేట్మెంట్
- ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా సాలిడ్ విజువల్స్ తో థ్రిల్ చేసిన “రాకాస”
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి.. మల్టీస్టారర్ మూవీలో ఫిక్స్..?
- వారికి హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!
- ఎన్టీఆర్, నీల్.. బర్త్ డే బ్లాస్ట్ గ్యారెంటీ!
- ‘పెద్ది’ షూట్ లో చరణ్ కి గాయం.. పవన్ స్పందన వైరల్
- యూత్ : చివరి నిమిషంలో రిలీజ్ డేట్ వాయిదా.. కొత్త డేట్ ఇదే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- AA22 : బన్నీ పాత్రపై అట్లీ హింట్.. ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ!
- ధురంధర్, యానిమల్, పుష్ప 2 నేర్పిన పాఠం : ప్రేక్షకులు భయపడేది బోర్ కొడితేనే.. సినిమా నిడివి ఎక్కువైతే కాదు!
- ‘పుష్ప 2’ రికార్డును లేపేసిన ‘ధురంధర్ 2’.. వెయ్యి కోట్లకు చేరువలో రణ్వీర్ స్పై యాక్షన్ థ్రిల్లర్
- ‘వారణాసి’ వరల్డ్: ఒక పద్ధతి.. ఒక విధానం.. జక్కన్న రూటే వేరు
- పోల్ : ఈ వీకెండ్ థియేటర్లలో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు..?
- ‘పెద్ది’ షూట్ లో చరణ్ కి గాయం.. పవన్ స్పందన వైరల్
- ‘ధురంధర్ 2’ సెన్సేషన్‌కు నో లిమిట్.. నార్త్ అమెరికాలో నయా రికార్డు..!
- OTT : తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బాలీవుడ్ వివాదాస్పద చిత్రం..!


