
యాక్షన్ హీరో విశాల్ , మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఇక విశాల్ -తమన్నా ఇంతకుముందు సూరజ్ తెరకెక్కించిన ‘కత్తి సండై’ చిత్రంలో జోడిగా నటించారు.
సుందర్ సి ప్రస్తుతం శింబు తో ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. అలాగే విశాల్ సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరు ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈ కొత్త చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

