ప్రకాష్ రాజ్, రజినీ కాదు రేలంగి మావయ్య రోల్ కి ముందు రాజశేఖర్ దగ్గరకి వెళ్లారట!

ప్రకాష్ రాజ్, రజినీ కాదు రేలంగి మావయ్య రోల్ కి ముందు రాజశేఖర్ దగ్గరకి వెళ్లారట!

Published on Mar 25, 2026 9:00 PM IST

rajase

మన తెలుగు సినిమా దగ్గర వచ్చినటువంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు” కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రేలంగి మావయ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎలాంటి పెర్ఫార్మన్స్ అందించారో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం మొదట సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకున్నట్టు ఆ మధ్య తెలిపారు.

కానీ లేటెస్ట్ గా ఇంకో స్పెషల్ పర్సన్ పేరు కూడా బయటకి వచ్చింది. మరి అదెవరో కాదు రాజశేఖర్ అట. ఈ ఊహించని విషయాన్ని లేటెస్ట్ గా రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బైకర్ ప్రమోషన్స్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకి ఆ పాత్రకి ముందు తనని సంప్రదించారు అని తన నవ్వు బాగుంటుంది అని ఆ పాత్రకి బాగా సెట్ అవుతుంది అని తెలిపారట. కానీ ఆ రోల్ ఎందుకో మిస్ అయ్యిందని తెలిపారు. మరి ఈ రోల్ లో తను చేసుంటే ఎలా ఉండేదో ఏమో మరి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు