లీసా ట్రైల‌ర్ ఒణికిస్తోంది – రామ్ గోపాల్ వర్మ

లీసా ట్రైల‌ర్ ఒణికిస్తోంది – రామ్ గోపాల్ వర్మ

Published on Nov 21, 2018 2:55 PM IST

Rgv3
సౌత్‌లో హార‌ర్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. ఓ వైపు బ‌యోపిక్‌లు, మ‌రోవైపు హార‌ర్ సినిమాలు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. జ‌న‌రేష‌న్ గ్యాప్ తో 3డి సినిమాల వెల్లువ మొద‌లైంది. హార‌ర్ కి రెగ్యుల‌ర్ 2డిలో కాకుండా 3డిని జోడిస్తే.. ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అందుకే తెలుగ‌మ్మాయ్ అంజ‌లి క‌థానాయిక‌గా త‌మిళ్‌-తెలుగు ద్విభాషా చిత్రం `లీసా` 3డి తో ప్ర‌యోగం చేస్తున్నారు.

తాజాగా రిలీజైన `లీసా` ట్రైల‌ర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓ అడ‌వి.. ఆ అడ‌విని ఆనుకుని ఫామ్‌హౌస్ అందులో ఓ దెయ్యం .. హార‌ర్ టెర్ర‌ర్ క‌థేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాల‌న్న ఉత్కంఠ‌ను పెంచింది. అయితే ఈ సినిమాని రియ‌ల్ 3డిలో వీక్షిస్తే క‌లిగే అనుభ‌వం వేరుగా ఉంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతున్నారు. రాజు విశ్వ‌నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో పీజీ మీడియా వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

తాజాగా వ‌ర్మ ట్వీట్ చేస్తూ `లీసా ట్రైల‌ర్ ఒణికిస్తోంది.. ఇన్‌స్పైరింగ్ 3డి సినిమా ఇది“ అంటూ ట్వీట్ చేశారు. గీతాంజ‌లి లాంటి హార‌ర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఆక‌ట్టుకున్న అంజ‌లి ఈసారి 3డిలో ఇంకెంత‌గా భ‌య‌పెట్ట‌నుందో అన్న ఆస‌క్తిని ఈ ట్రైల‌ర్ క‌ల‌గ‌జేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు