ENE రిపీట్ : షూటింగ్ ఫినిష్.. నవంబర్ 19న థియేటర్లలో రచ్చ రంబోలా!

ENE రిపీట్ : షూటింగ్ ఫినిష్.. నవంబర్ 19న థియేటర్లలో రచ్చ రంబోలా!

Published on Sep 1, 2026 3:36 PM IST

ENE-2

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చి యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న క్లాసిక్ బడ్డీ కామేడీ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. ‘ENE రిపీట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ రెండవ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ హంగులు మరియు ఊహించని సర్‌ప్రైజ్‌లతో ఈ చిత్రం అలరించబోతోంది.

విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులకు సరిపడా సమయం కేటాయించేందుకు చిత్రబృందం పక్కా ప్లానింగ్‌తో ముందే పనులు పూర్తి చేసింది. ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను తిరిగి తమ ఐకానిక్ పాత్రల్లో మెరవనుండగా, సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు.

సృజన్ యర్రబోలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మళ్ళీ తన మార్క్ మ్యూజిక్‌తో సందడి చేయనున్నారు. యూత్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు