
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈచిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి అనివార్య కారణాల వల్ల లొకేషన్ కు గంట ఆలస్యంగా వచ్చారట. అయితే ఆ సమయాన్ని వృథా చేయకుండా చిరు దర్శకుడి స్థానంలో కూర్చొని షూటింగ్ ను పర్యవేక్షించారట. ఆతరువాత సురేందర్ రెడ్డి రాగానే చిరు తన స్థానంలోకి వెళ్లిపోయారట. సినిమా పట్ల చిరుకి ఉన్న అకింత భావం చూసి సెట్ లో ఉన్న వాళ్ళు షాక్ అయ్యారట.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్ , సుధీప్ , విజయ్ సేతుపతి,నయన తార , తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచానాల మధ్య ఈచిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకానుంది.

