విజయ్ 63 లో హీరోయిన్ ఎవరంటే !

విజయ్ 63 లో హీరోయిన్ ఎవరంటే !

Published on Nov 25, 2018 7:13 PM IST

Nayan

ఇటీవల సర్కార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక నటించనుందని కొద్దీ సేపటి క్రితం చిత్ర నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ అధికారకంగా ప్రకటించింది . ఎఆర్ రహమాన్ సంగీతం అందించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది.

ఇక ఇంతకుముందు విజయ్ -అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘తేరి, మెర్సల్’ చిత్రాలు ఒకదానికి మించి ఒకటి విజయం సాదించడంతో ఈ మూడవ చిత్రంఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు