‘ముద్ర’ డబ్బింగ్ లో నిఖిల్ !

‘ముద్ర’ డబ్బింగ్ లో నిఖిల్ !

Published on Nov 28, 2018 2:39 PM IST

nikhil14

యువ హీరో నిఖిల్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ముద్ర’ షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది. దాంట్లో భాగంగా నిఖిల్ ఈచిత్రానికి డబ్బింగ్ చెప్పారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ కొత్త లుక్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం డిసెంబర్ 28న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు