శర్వా ను రిప్లేస్ చేయనున్న దుల్కర్ ?

శర్వా ను రిప్లేస్ చేయనున్న దుల్కర్ ?

Published on Dec 10, 2018 11:28 PM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నాని , శర్వానంద్ లు కలిసి నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో శర్వా ప్లేస్ ను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో రి ప్లేస్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారంగా ఎలాంటి సమాచారం లేదు.

ఇక మహానటి చిత్రంతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాంతో దుల్కర్ ని తీసుకుంటే టాలీవుడ్ తోపాటు మాలీవుడ్ లోకూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు.

ఇక నాని ప్రస్తుతం ‘జెర్సీ’ లో నటిస్తూ బిజీ గా ఉండగా దుల్కర్ సల్మాన్ ఒక తమిళ చిత్రం తో పాటు ఒక మలయాళ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు