పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ పై దర్శకుడు ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ స్పష్టం చేశాడు.
ప్రభాస్ తన మిగతా సినిమాల కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని ఫ్రీ కాగానే ‘కల్కి 2’ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూళ్లను వేగంగా ప్రారంభించనున్నట్లు తెలిపాడు. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో ఈ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.


