
విశ్వవిఖ్యాత ,లెజండరీ పొలిటీషియన్ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’. ఇక ఈచిత్రం యొక్క ఆడియో &ట్రైలర్ లాంచ్ ఈ రోజు హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరుగనుంది. ఈ వేడుకకు సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ , కృష్ణం రాజు , మోహన్ బాబు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

