టాలీవుడ్‌లో సెన్సేషనల్ డెబ్యూతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలీల, ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే, ‘భగవంత్ కేసరి’ వంటి కొన్ని సినిమాలు మినహా ఆమె ఎంచుకున్న మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతోంది.
ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఆమె జోడీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె క్యారెక్టర్ డిజైన్ అరకొరగా ఉండటం, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన పాత ఫామ్‌ను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.
వరుస పరాజయాలు ఉన్నప్పటికీ శ్రీలీల రెమ్యూనరేషన్ తగ్గించకపోవడంతో, పలువురు తెలుగు నిర్మాతలు ఇతర హీరోయిన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టులేవీ లేవు. దీంతో ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి సారించింది. మరి శ్రీలీల బ్యాడ్ టైమ్ ఇంకా ఎంతకాలం సాగుతుందో చూడాలి.


