కొరటాల సినిమాలో రామ్ చరణ్ లేనట్లే !

కొరటాల సినిమాలో రామ్ చరణ్ లేనట్లే !

Published on Dec 23, 2018 4:00 AM IST

Ram charan koratalashiva3

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలే మరో ఆసక్తికరమైన వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అదే కొరటాల, మెగాస్టార్ కోసం రాస్తోన్న స్క్రిప్ట్ లో రామ చరణ్ కోసం ఒక కీలకమైన పాత్రని కూడా రాసుకున్నాడని. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కొరటాల కేవలం మెగాస్టార్ ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తీ అయ్యాక చిరంజీవి – కొరటాల శివ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

తాజా వార్తలు