ఈషా రెబ్బా కు ప్రెస్టీజియస్ అవార్డు !

ఈషా రెబ్బా కు ప్రెస్టీజియస్ అవార్డు !

Published on Dec 26, 2018 2:00 PM IST

Esha21

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రెస్టీజియస్ అవార్డు ను సొంతం చేసుకుంది. ‘అమీ తుమీ’ చిత్రానికి గాను ఉత్తమ నటి విభాగంలో ఆమె కు శోభన్ బాబు అవార్డు వరించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ‘అమీ తుమీ’ గత ఏడాది లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివి శేష్ ,శ్రీనివాస్ ఆవసరాల , ఈషా రెబ్బా ,అదితి ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక ఈ ఏడాది ఈషా ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించగా సుమంత్ ‘సుబ్రమణ్యపురం’లో హీరోయిన్ గా నటించింది. వీటిలో అరవింద సమేత విజయం సాధించగా సుబ్రమణ్యపురం పర్వాలేదనిపించింది.

తాజా వార్తలు