‘అమ్మ’ బయోపిక్ బడ్జెట్ ఎంతంటే !

‘అమ్మ’ బయోపిక్ బడ్జెట్ ఎంతంటే !

Published on Jan 6, 2019 5:42 PM IST

Jayalalitha

తమిళుల ఆరాధ్య ధైవం, పురుచ్చితలైవి జయలలిత నిజ జీవితం ఆధారంగా ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కనుందని తెలిసిందే. ‘డిటెక్టివ్’ ఫేమ్ మిస్కిన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటించనుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఫిబ్రవరి 24న అమ్మ జయంతి సందర్భంగా ప్రారంభం కానుంది. షూటింగ్ అంత హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగనుంది. 10కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంలో లెజండరీ యాక్టర్ ఎమ్ జి ఆర్ పాత్రను మలయాళ నటుడు సుగుమార్ పోషించనున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, జయలలిత జీవిత కథను వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటి రమ్యకృష్ణ , అమ్మ పాత్రలో నటిస్తుంది.

తాజా వార్తలు