మన టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే యువ హీరో విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి కోసం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ స్టాంప్ టాలీవుడ్ లో బలంగా నాటుకుంది. మరి అలాంటి సినిమా ఇచ్చిన దర్శకుడుకి ఆ హీరో ఎంత విధేయత చూపాలో అంతకు మించే విజయ్ చూపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సందీప్, తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాల నిర్మాణంలో యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన సినిమా రొమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ పట్ల విజయ్ దేవరకొండ తన లాయల్టీ చూపించాడు. సందీప్ పిలిచాక కూడా రాకపోతే ఇక బతికి కూడా వేస్ట్ అంటూ తనకి లైఫ్ ఇచ్చిన దర్శకునికి అంతకు మించిన గౌరవాన్ని అందించి విజయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. దీనితో విజయ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.


