తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఈ నెల 10న తమిళంలో భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర యొక్క తెలుగు వెర్షన్ మాత్రం అదే సమయానికి రిలీజ్ కావడం లేదు. సంక్రాంతి కి టాలీవుడ్ నుండి బడా సినిమాలు విడుదలకానుడడంతో ఆ చిత్రాలతో పోటీ ఎందుకని ఈ చిత్ర విడుదలను వాయిదా వేశారట. ఇక తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రిపబ్లిక్ డే వీకెండ్ కు విడుదలచేయలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.
సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందించారు.


