‘బైలంపుడి’ లిరిక‌ల్ సాంగ్ విడుదల !

‘బైలంపుడి’ లిరిక‌ల్ సాంగ్ విడుదల !

Published on Jan 10, 2019 8:07 AM IST

Bailapudi

హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బైలంపుడి’.తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని లిరిక‌ల్ సాంగ్ ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి చేతుల మీదుగా లాంచ్ చేశారు. అనంత‌రం మైరా అమిథి మాట్లాడుతూ. `పిల్ల‌ల దేవుడు` ప‌ల్ల‌వితో సాగే సాంగ్ చాలా బావుంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. అంద‌రూ కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా న‌టించారు. షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో సినిమాని తెర‌కెక్కించాము. `ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడినికి“ అనేది మా సినిమా క్యాప్ష‌న్. ‘పిల్ల‌ల దేవుడు’ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశాం. అంద‌రికీ పాట న‌చ్చుతుంద‌న్న నమ్మ‌కం ఉంది“ అన్నారు.

హీరో హ‌రీష్ విన‌య్ మాట్లాడుతూ సుభాష్ గారు అద్భుత‌మైన సాంగ్స్ ఇచ్చారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా తీసారు అన్నారు. ద‌ర్శ‌కుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడుగా ఇది తొలి సినిమా బైలంపుడి అనే గ్రామంలో జ‌రిగే ల‌వ్ అండ్ పొలిటిక‌ల్ చిత్ర‌మిది. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జ సిద్ధంగా ఉంటుంది. మా సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాఅన్నారు.

తాజా వార్తలు