నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘ముద్ర’. ఇప్పటికే నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు వాయిదాలు పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతుందని.. లేదు ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఆ తేదీలు కూడా విడుదలయ్యే సూచనలు లేవని తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదా మరో కొత్త తేదీని ప్రకటిస్తారో లేదో చూడాలి.
కాగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘కనితన్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరెకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చెయ్యటానికి ఎప్పుడు ఇష్టపడే నిఖిల్.. ఈ సినిమాలో అలాంటి పాత్రతో పాటు ఓ సరి కొత్త లుక్ లో కనిపించనున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


