‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కథానాయికగా నటిస్తుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో సినిమా రూపొందుతుందట. అంతేకాకుండా ఇంతవరకు ఇండియాలో ఏ సినిమాలో కూడా ఇన్ని విజువల్స్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు లేవని చెబుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్ లో సుజీత్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవం కానుకగా విడుదలకానుంది.
ఇక ప్రభాస్ ఈ చిత్రం తో పాటు జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రం లో నటిస్తున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకులముందుకు రానుంది.


