‘డేవిడ్‌ రెడ్డి’ ప్యాచ్ వర్క్ కోసం సన్నాహాలు !

‘డేవిడ్‌ రెడ్డి’ ప్యాచ్ వర్క్ కోసం సన్నాహాలు !

Published on Mar 22, 2026 9:20 AM IST

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయడానికి టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షూట్ లో మనోజ్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ఇక ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

తాజా వార్తలు