నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. భారీ అంచనాల మధ్య జనవరి 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో మొదటి రోజు ఈచిత్రం 7.61కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే రెండవ రోజు మాత్రం కలెక్షన్లు భారీ గా డ్రాప్ అయ్యాయి.
దాంతో రెండవ రోజు కేవలం 1.05 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అయితే ఈ చిత్రానికి పండుగ సీజన్ కావడం కలిసి వచ్చింది. మరి పండుగ సెలవులను ఉపయోగించుకుని ఈ సినిమామంచి కలెక్షన్లను రాబడుతుందో లేదో చూడాలి.
తెలంగాణ &ఏపీలో రెండు రోజుల కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలక్షన్స్ |
| నైజాం | 2.22 కోట్లు |
| సీడెడ్ | 98 లక్షలు |
| నెల్లూరు | 55.52 లక్షలు |
| గుంటూరు | 2.13 కోట్లు |
| కృష్ణా | 85లక్షలు |
| పశ్చిమ గోదావరి | 75లక్షలు |
| తూర్పు గోదావరి | 47లక్షలు |
| ఉత్తరాంధ్ర | 96లక్షలు |
| ఏపీ, తెలంగాణ రెండు రోజుల షేర్ | 8. 91 కోట్లు |


