రెండు డిఫరెంట్ లుక్స్ లో నాగ చైతన్య !

రెండు డిఫరెంట్ లుక్స్ లో నాగ చైతన్య !

Published on Jan 11, 2019 9:33 PM IST

Naga Chaitanya

అక్కినేని సమంత, అక్కినేని నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడట. సమంతతో పెళ్లికి ముందు ఒక గెటప్ లో.. అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో చైతు కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు,సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం పై అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు