ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వంలో నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రావే నా చెలియ’. ఈ చిత్రం సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమ వేడుక శుక్రవారం జరుపుకుంది. ఈ చిత్రం లోగోను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రావే నా చెలియా’ టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కంటెంట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా. ఎంటైర్ టీమ్ కు నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా అని అన్నారు.
దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విరాజ్ వలనే ఈ సినిమా మొదలైంది. నిర్మాతలు,మరియు హీరో అనిల్ కూడా నన్ను చాలా నమ్మి సపొర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చెయనని ఈ సందర్బంగా తెలియ చేస్తున్నా అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం:ఎమ్ ఎమ్ కుమార్, కెమెరా: విజయ్ దగ్గుబాటి, ఎడిటర్: రవి మాన్ల, నిర్మాతలు: నెమలి అనిల్, నెమలి శ్రవణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్. మహేశ్వర రెడ్డి.


