డ్రాప్ అవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలక్షన్స్ !

డ్రాప్ అవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలక్షన్స్ !

Published on Jan 12, 2019 7:00 PM IST

ntr31

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావటంతో ఈ చిత్రం ఫై విడుదలకు ముందే భారీ అంచనాలునెలకొన్నాయి. భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ చిత్రం అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా జరుపుకుంది . ఇక ఈ చిత్రం ఈనెల 9న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది కానీ మౌత్ టాక్ నెగిటివ్ గా రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతున్నాయి.

మొదటి రోజు 9కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదనిపించిన ఈచిత్రం ఆ తరువాత రెండు రోజుల్లో బాక్సాఫిస్ వద్ద చతికిలపడింది. మూడు రోజులకుగాను ప్రపంచ వ్యాప్తంగా కేవలం 13కోట్ల షేర్ ను మాత్రామే రాబట్టిందంటే ఈ సినిమా పరిస్థితి ఏరకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి పండుగ సెలవుల్లో అయినా ఈ చిత్రం ఆశించిన స్థాయిల్లో వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు