డియర్ కామ్రేడ్ దర్శకుడికి పితృవియోగం !

డియర్ కామ్రేడ్ దర్శకుడికి పితృవియోగం !

Published on Jan 23, 2019 3:08 PM IST

bharath khamma

‘డియర్ కామ్రేడ్’ చిత్ర దర్శకుడు కమ్మ భరత్ తండ్రి కమ్మ రమణారావు (65) ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. సాహసం డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి డియర్ కామ్రేడ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయవుతున్న భరత్ కి తన మొదటి సినిమా పూర్తి కాకముందే కోలుకొని దెబ్బ తగిలింది.

విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రం ఈ సమ్మర్ లో విడుదలకానుంది.

తాజా వార్తలు