
ప్రముఖ కొరియోగ్రఫర్ , దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కాంచన 3 లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ ‘ముని’ సిరీస్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం ఏప్రిల్ 18న విడుదలకానుంది.
ఇక ఇదిలావుంటే లారెన్స్ డైరెక్టర్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు , తమిళంలో సూపర్ హిట్ అయినా ‘ కాంచన’ చిత్రం హిందీలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్న ఈ చిత్రాన్ని లారెన్స్ తెరకెక్కించనున్నడని సమాచారం. ఈచిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుంది.

