ఆర్ఆర్ఆర్ లోకి బాలీవుడ్ హీరోయిన్ ?

ఆర్ఆర్ఆర్ లోకి బాలీవుడ్ హీరోయిన్ ?

Published on Jan 26, 2019 3:30 PM IST

Parineeti Chopra

బాహుబలి తరువాత ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటించే హీరోయిన్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అందులో భాగంగా కీర్తి సురేష్ , రాశి ఖన్నా , కియరా అద్వానీ ఇలా పలువురి తారల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం మాత్రం స్పందిచలేదు. దాంతో ఇవ్వని రూమర్లుగానే మిగిలిపోయాయి.

ఇక ఇప్పుడుకథానాయిక పాత్ర కోసం చిత్ర బృందం బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ను సంప్రదించారని టాక్. మరి ఆమె ను తీసుకుంటారో లేదో అనే విషయం ఫై తర్వలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తుండడంతో ఆయా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులను ఈ చిత్రంలోకి తీసుకుంటున్నారు రాజమౌళి.

ఇటీవల ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు