నైజాంలో ‘ఎఫ్ 2’ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ !

నైజాంలో ‘ఎఫ్ 2’ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ !

Published on Jan 28, 2019 1:51 PM IST

f2oe

ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు చిత్రాల్లో ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలైన 16 వ రోజు కూడా ‘ఎఫ్ 2’ నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది.

ఆదివారం నాడు, నైజాంలో ‘ఎఫ్ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 92 లక్షల వసూలు చేసి.. రూ .20 కోట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ చిత్రం యొక్క తాజా నైజాం కలెక్షన్స్ ప్రకారం మొత్తం రూ. 20.52 కోట్లుగా ఉన్నాయి. ఎఫ్ 2 మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో పాటు వెంకీ మరియు వరుణ్ తేజ్ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.

తాజా వార్తలు