ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే… అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్. రఘురాజ్ దర్శకత్వం వహించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
నిర్మాత ‘జెమిని’ కిరణ్ ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ సంస్థ లోగోను విడుదల చేశారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా న్యూ ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఆడియో బిగ్ సీడీ విడుదల చేశారు.
దర్శకుడు ఆర్ రఘురాజ్ మాట్లాడుతూ ‘‘సినిమాలకు చాలా అద్భుతాలు జరిగాయి. ఫస్ట్… సినిమా షూటింగ్ 75 రోజుల్లో పూర్తి చేశాం. దీనికి మా టీమ్ కారణం. మంచి మెసేజ్‌తో తీసిన సినిమా ఇది. ఒకరోజు ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తుంటే… ‘సైన్స్ ఈజ్ అబౌట్ థింకింగ్. ఇంజనీరింగ్ అబౌట్ డూయింగ్. బట్, ఆల్ ఇంజనీయర్స్ ఆర్ డయింగ్’ అని ఒక బోర్డ్ చూశా. మా డ్రైవర్‌ని అడిగితే… అతనూ బీటెక్ స్టూడెంట్ అని తెలిసింది. అప్పుడు వచ్చిన ఆలోచనతో ఈ సినిమా తీశా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఈ సినిమా అంకితం ఇస్తున్నాం. సినిమా సెకండాఫ్‌లో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాం. ‘లవ్ ఎట్ సెవన్ లుక్’ కాన్సెప్ట్‌తో చేశా. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. నేను అడిగిన ఆర్టిస్టులు ఇచ్చారు. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
నిర్మాత ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో, న్యూయార్క్ సిటీలో సెటిలైన తెలుగు ఫ్యామిలీ మాది. 21 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నా. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మా ఇంట్లో తెలుగు వాతావరణం కనిపిస్తుంది. మా అమ్మాయి భరతనాట్యం కళాకారిణి. మా అబ్బాయిని డాక్టర్ చేయాలనుకున్నాం. తను యాక్టర్ అవుతానని చెప్పడంతో సత్యానంద్‌గారి దగ్గరకి పంపాను. సినిమాలపై ప్రేమతో ‘4 లెటర్స్’ తీశాం. ఇంజనీరింగ్ నేపథ్యంలో తీసిన ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నాం. ట్రైలర్స్, సాంగ్స్ చూసి అందరూ మా అబ్బాయి బాగా చేశాడని అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు, కొత్తవారితో సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో చదువున్నా. అయితే సినిమాలు అంటే ఎప్పటినుంచో ఇష్టం. ఇండియా వచ్చినప్పుడు కాస్త నెర్వస్‌గా ఉండేది. దర్శకుడు రఘురాజ్‌గారితో మాట్లాడితే షూటింగ్ స్టార్ట్ అయ్యే రెండు నెలల ముందు వర్క్‌షాప్స్ చేద్దామన్నారు. మా దర్శకుడు నాకు బాడీ లాగ్వేంజ్, వర్క్ డిసిప్లేన్ అన్నీ నేర్పించారు. నేను సత్యానంద్‌గారి నటనలో శిక్షణ తీసుకున్నా. ఫ్యామిలీలో అందరికీ ఇంట్రెస్ట్ ఉండటంతో, ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ కావాలని ఈ సినిమా నిర్మించడానికి అమ్మానాన్న అంగీకరించారు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్, సీనియర్ నటుడు సురేష్, కొరియోగ్రాఫర్ గణేష్, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


