బాలయ్య సినిమాలో రాజకీయాలు ఉండవట !

బాలయ్య సినిమాలో రాజకీయాలు ఉండవట !

Published on Feb 1, 2019 11:37 PM IST

Balakrishna2

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఫిబ్రవరి మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

తాజా వార్తలు