సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ హైద్రాబాద్లో స్టార్ట్ అయ్యింది. మార్చివరకు జరుగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. త్వరలోనే సినిమాకు ముఖ్యమైన అప్ డేట్స్ కూడా వెలుబడనున్నాయి.
ఇక ఇదిలావుంటే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి రోజు మార్చి 4న విడుదలచేయనున్నారని టాక్. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న విడుదలకానుంది.


