విశ్వంభర కోసం మెగా ఫాన్స్ నిరీక్షణ..?

విశ్వంభర కోసం మెగా ఫాన్స్ నిరీక్షణ..?

Published on Mar 21, 2026 1:00 AM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’ విడుదల కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, విడుదల మాత్రం దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తొలుత 2025 సంక్రాంతికి అనుకున్నా, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కోసం వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గ్రాఫిక్స్ (VFX) పనుల్లో ఆలస్యం కారణంగా 2025 వేసవి విడుదల కూడా సాధ్యం కాలేదు.

​ప్రస్తుతం ఈ చిత్రాన్ని జూలై 9, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది పర్వదినాన దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అందరూ ఆశించినప్పటికీ, మేకర్స్ మాత్రం మౌనాన్ని వీడలేదు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ మరియు ఇతర నాన్-థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కావాల్సి ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ ఒప్పందాలు కుదిరితేనే జూలై విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

​వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న జూలై విడుదల తేదీ గురించి చిత్ర యూనిట్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

తాజా వార్తలు