యాత్ర కు మరి అంత తక్కువ రన్ టైం !

యాత్ర కు మరి అంత తక్కువ రన్ టైం !

Published on Feb 3, 2019 12:56 PM IST

yatra

లెజండరీ పొలిటీషియన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ విడుదలకు సిద్దమవుతుంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈచిత్రం యొక్క రన్ టైం ఆశ్యర్యానికి గురి చేస్తుంది. కేవలం 126 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. సాధారణంగాబయోపిక్ సినిమాలాంటే ఎక్కువ రన్ టైం ను వూహించుకుంటాం. కాని ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు కి నిడివి ఎక్కువ వుందన్న కంప్లైన్ట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఆ సినిమా ఫలితం ఫై పడింది. దాంతో యాత్ర రన్ టైం విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మరి కేవలం రెండు గంటల ఆరు నిమిషాల్లో సినిమాను పూర్తి చేయడం అంటే సవాలుతో కూడుకున్నపనే. ఈవిషయంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యిందో లేదో తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.

అయితే సినిమా ప్రారంభం అవ్వడమే వైఎస్సార్ పాదయాత్ర తో స్టార్ అవుతుందని సమాచారం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

తాజా వార్తలు