టాలీవుడ్ లో మహేష్ ఒక్కడికే ఆ గౌరవం !

టాలీవుడ్ లో మహేష్ ఒక్కడికే ఆ గౌరవం !

Published on Feb 22, 2019 10:00 PM IST

mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు ఓ విషయం మంచి కిక్ ఇస్తోంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మహేష్ బాబే లాంచ్ చేయబోతున్నాడు.

హైదరాబాద్లోని ఏఎంబి సినిమా స్ వేదికగా మార్చి 25వ తేదీన ఈ విగ్రహాన్ని మహేష్ బాబు లాంచ్ చేస్తున్నారు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలోకి తరలించి ఇక అక్కడే ప్రదర్శిస్తారు.

టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబుకు మాత్రమే ఈ గౌరవం దక్కడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు